మొబైల్ ఫోన్ -బాగ్యమా, భారమా !

కొత్త సంవత్సర శుభాకాంక్ష్లలు
ఎందుకోచాలా రోజుల తరువాత రాయాలని పించినది.

సామాన్యుల నుంచి మాన్యుల వరకూ మొబైల్ ఫోన్ అవసరంలేని వారు కనిపించని రోజులివి. ప్రపంచంలో అత్యధికంగా ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో మొబైల్ ఫోన్ల అమ్మకాలు, కొత్త కనెక్షన్ల పొందే వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది . గతంలో భారతదేశంలో ఆన్‌లైన్ సేవలు విసృతంగా జరిగితే, వాటిని మొబైల్ ఫోన్లు ఆక్రమించాయి. కాని మా వూరి కధవేరు.

 మావూరి కి పోయిన సంవత్సరమే మొబైల్ ఫోన్ సేవలు వచ్హాయి చాలామంది రైతు కూలివారు తమ స్టొమతనుబట్టి ఒక మొబైలు ఫొను కొనుక్కొనారు మరి ఫొను కొన్నతరువాత రోజుకు ఒకసారి అయినా మాట్లాడాలికదా ! .ఈ కంపెనీలు ఇచ్చే పదకాలు కు అయితెనేమి, అవసరానికి  అయితెనేమి ,అనవసరానికి అయితెనేమి మా గ్రామము లో ఫొను వాడకము భాగా పెరిగినది ఫలితము నెలకు మూదు వందల రూపాయల బిల్లు ,నా పరిశీలన  ప్రకారము అనవసర సంబాషణలే చాలా ఎక్కువ. మావూరిలో  జనాలంతా కనీసము యబై వేల రూపాయలు నెలకు ఈ కంపెనీలకు సమర్పించు కొనటనము చాలా బాదగా వున్నది.  దీనికి కారణమేమిటో నాకు బోదపడుటలేదు .  

Advertisements

8 responses to “మొబైల్ ఫోన్ -బాగ్యమా, భారమా !

 1. అదే యాభై వేలు పెట్టి మంచి నీటి ట్యాంకు కట్టుకుందాం అని రమ్మనండి. ఒక్కరూ ముందుకు రారు.
  మరళా ప్రభుత్వం ఇది చెయ్యలెదు..అది చెయ్యలేదు అంటారు. ఇది బాబూ లోకం తీరు. ఎప్పుడో ఒకసారి కరువు రాకాపోదు..అప్పుడన్నా టింగని బల్బెలుగుతే బాగున్ను. అప్పుడు ప్రభుత్వం కరంటు సప్లై చేస్తే కదా బల్బెలిగేదని చమత్కరిస్తారు కూడా.

 2. మా ఊరికి బస్ సౌకర్యం కూడా లేదు.ఒకే ఒక్క ఆటో తిరుగుతూ వుంటుంది.అతనికి సెల్ ఫోను వున్నందువల్ల ఊరిలో అందరికి అందుబాటులో వుండగలుతున్నాడు.అలాగే మిగిలిన సామాన్యులు కూడా…మొదట్లో నేను కూడా మీలాగే అనుకున్నాను.తరువాత తరువాత అన్ని ఎల వుపయోగ పడుతున్నాయో తెలుసుకుని చాలా సంతోషించాను.అవసరం లేకుండా డబ్బులు దుబారా చేసే స్తాయికి ఇంకా పల్లెటూళ్ళు ఎదగలేదని నా అభిప్రాయం.[మరి మా ఊరిలో ఇంకా అవసరానికి మించి ఆదాయం ఎవరికీ రావట్లేదు.అందుకే ఇంకా మంచిగా బ్రతగ్గలుగుతున్నట్టున్నారు.]

 3. అనవసరంగా ఖర్చు పెడుతున్నారని మీరు బాధ పడకండి. కొన్ని రోజులకి వాళ్ళే మానేస్తారు.

  ఈ సంవత్సరాంతానికి అన్ని ఫోన్ల కంపెనీలు ఊహించని విధంగా రేట్లు తగ్గిస్తాయి.
  నెలకి ఐదు వందలు చెల్లించండి, రోజంతా మాట్లాడండి అనే ఆఫర్ కూడా ఇస్తాయి.

  కశ్యప్, గుర్తుంచుకోండి. ఆ రోజు మళ్ళీ ఇక్కడ ఐతె OK నా అంటాను.

  -కిరణ్

 4. నా ఉద్దేశ్యంలో దీని గురించి బాధపడి ప్రయోజనం లేదు. ఎవరు ఎలా డబ్బులు ఖర్చుపెట్టాలి అని నిర్ణయించేది మనం కాకూడదు. రాధిక గారి ఉదాహరణ చూడండి: సెల్ ఫోన్ ని సద్వినియోగం చేసుకునేవారు కూడా ఉంటారు. నిజానికి, ఆ కేటగిరీ లో నే ఎక్కువ మంది ఉంటారని, నా అభిప్రాయం. అనవసర సంభాషన అని చెప్పటానికి( జడ్జ్, చెయ్యటనికి!) మనమెవరం?

 5. మనం ఇక్కడ ఒక విషయం గమనించినమో లేదో? లేకపోతె ఒక మాటనే కదా అనేది అని నోరు పారేసుకుంటున్నమో? అన్న విషయాలు పక్కకు పెడితె…
  అమలాపురం అయినా, ఆలేరు అయినా.., అమెరికా అయినా భారతదేశమైనా., కన్స్యూమర్ ని ఎట్ల ఇరికిస్తరో విదేశాల్ల ఉన్నోల్లకి విప్పి చెప్పాల్సిన అవసరం లేదు.

  అమెరికాలో ఉన్నంత మాత్రాన నాకు సెల్ అవసరం , ఊర్లో ఉన్నోడికెందుకో తెల్వది కని.. ఒక విషయం మనం neglect చెయ్యొద్దు… ఇప్పడు ఉన్న పరిస్తితుల్లో పెద్ద వ్యాపర సంస్థలు వ్యాపారానికి ఎంతయినా దిగజారుతాయి (ఉదా: సెల్ కొనేంతసేపు తియ్యగా మాట్లాడి 2 సంవత్సరాల కాంట్రాక్ట్ లల్ల ఇరికిచ్చ మెసలనియ్యకుంట చేసినట్టు)

  మన దేశంల ఈ మధ్య spending capacity ఓ బాగ పెరిగిందని అంటున్నరు (ఎక్కడ, ఎందుకు అన్న చర్చలకి దిగకుంట). ఖర్చు పెట్టగలిగినవాడు పెడ్తనే ఉంటడు, ఎటొచ్చి చిక్కంతా మద్య తరగతి వాల్లది(lower middlee too .., పల్లేలలున్నోల్లు దీంట్లకు వస్తరా అనేది సెన్సస్ వల్లకొదిలేద్దాం 🙂 )

  US, Europe, Aussy మార్కెట్లు అన్ని saturate అయినయని వేరె చెప్పనవసరం లేదు, ఎటొచ్చి మంచి కన్స్యూమర్ బేస్ రెడీగా కనిపిచ్చేది India, Chinaల (అక్కడ ఏం జరుగుతుందో తెల్వదు కాని). మన దెగ్గర పక్కింటోడు TV కొంటె మనోడు tv కొనాలాయె, వాడు కుక్కను తొక్కితె మనోడు నక్కను తొక్కాలాయె. ఒకప్పుడు రేడియో టి.వీ ల లెక్క ఇప్పుడు సెల్ ఫోన్ ఇప్పటి స్టేటస్ సింబల్ అయ్యె.

  భారత కన్స్యూమర్ ని ఇప్పుడు తాకింది మొదటి కెరటమేనేమో., ముందటేమున్నదో చూడాలె.

 6. బాగా చెప్పారు జయప్రకాశ్ గారు. నేను 100% మీతో అంగీకరిస్తున్నా. పులిని చూసి నక్కవాతబెట్టుకోవడమనే మన ప్రవృత్తి చాలా భయంకరమైనది.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s