jump to navigation

ఓ ..పాలబుగ్గల జీతగాడా ! ఏప్రియల్ 17, 2007

Posted by kasyap in Uncategorized.
2 comments

పాలబుగ్గల జీతగాడా
పసులుగాసె మోనగాడా
పాలుమరచి ఎన్నాళ్ళయిందో
ఓ ..పాలబుగ్గల జీతగాడా
కోలువు కుదిరి ఎన్నాళ్ళయిందో !

చాలిచాలని చింపులంగి
చల్లగాలికి సకమకాలి
గోనె సంచి కొప్పునీపెట్టావా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
దానిచిల్లులెన్నో లెక్కబెట్టావా  !
 
తోలు జగ్గల కాలిజోడు
తప్పటడుగుల నడకతీరు
బాటలో పనిలేకుండయిందా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
చేతి కర్రె తోడై నిలిచిందా   !

మాయ దారి ఆవు దూడలు
మాటి మాటికి ఎనుకు దునికి
పంట చేను పాడు చేశాయా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
పాలికాపు నిన్నే కోట్టాడా !

(ఇది చిన్నప్పుడు రేడియోలో వినేవాడిని ఇక ఎన్ని చరణాలు వున్నాయో గుర్తులేదు , రాసినది ఏవరో  కూడా తెలియదు కాని శ్రవ్యంగా పాడితే చాలా ప్రభావితముగా వుంటుంది …ఎప్పుడోవిన్న పాట తప్పులు వుంటె ఎత్తి చూపండి సరి చేసుకోంటాను)   
   

నాకు గౌరవము ఇవ్వండహో! ఏప్రియల్ 16, 2007

Posted by kasyap in Uncategorized.
2 comments

ఈమద్య చూసిన ఒక mail కి   రాయాలని పించినది

 http://oremuna.com/blog/?p=1067

ఎవరు ఎవరిని మార్చాలి అసలు ఎందుకు మార్చాలి , ఎవరు మిమ్మలను మర్చాలి ,మీరు ఎందుకు మారాలి? ,  వాడికి  ఏ అదికారము వున్నదని మార్చాలి.హిందూ మతము ,ఒక మతమే కాదు ఒక దర్మము దీనిని పాటించటానికి ఏ బాబానో, స్వామో రావలసిన అవసరము లేదు , అసలు మతమే లేనప్పుడు ఒకడికి ఆమతము మీద మతాదికారమూ లేదు బేషూగ్గా ఈ దర్మాని పాటించవచ్చు ఇంకా కావానుకోంటె మీ పేరు చివర ఏ శర్మ,రెడ్డో పేట్టుకోండి ! , కాని మీరు ఈ కుల బీజమును రూపుమాపలెరు
ఎందుకంటె ఇది భారతదేశము. చివరికి మీరుకూడా “నన్ను హిందూత్వంలోకి ఆహ్వానించి బ్రాహ్మణిడిగానో, రెడ్డిగానో, రాజుగానో, కమ్మగానో చేస్తే ఆనందంగా స్వీకరిస్తాను.అందుకోసం నా బి.సి.రిజర్వేషన్ను కూడ వదులుకుంటాను. ” ఇంకా కుల భావమకువదిలి వేయులేదు అసలు ఈరోజుల లో అగ్రకుల మున్నదే లేదు వున్నవల్లా ఆర్దిక అసమానతలు ! ప్రతివాడు తన స్వాబిమానము కాపాడు కోవాలి ,అది తననుండే రావాలి  దూదేకుల వాడిగానో ,దళితుడిగానో చెప్పుకోవటానికి మొహమాటము పడనఅవ్ససరములేదు , నాకు గౌరవము ఇవ్వండహో!  అని ఎవడవిడినో అడగ వలసిన అవసరము అంతకన్నాలేదు…

ఏమిటొ అసలు ఈ జీవితము మార్చి 20, 2007

Posted by kasyap in Uncategorized.
3 comments

ఏమిటొ అసలు ఈ జీవితము లో మరీ మలుపులు ఎక్కువయి పోయినాయి అసలు పండగ ఎప్పుడొ తెలుకునె అప్పటి కే పండగ వెళ్ళిపోతోంది. హామ్మ నిన్న కొన్ని తొరణము ఇవ్వాళ కొన్ని తోరణము,
నిన్న రెండు సార్లు తలస్తానము (షాంపూ లేకుండా),ఇవ్వాళ ఒక సారి షాంపూతొటి
నిన్న పరవన్న నవేద్యము ఈరోజు కొబ్బరి కాయ,నిన్న స్వయంపాకము ఈ రోజు మెస్సు లో ఉగాది ప్రతేక బోజనము, ఇలా నా ఉగాది గడచినది..

ఈ  సర్వబాదలను ఈ సర్వ జిత్ నామ సంవత్సరం లో చిత్తు చేయాలని వున్నది -(అంటే దీని అర్దం పెళ్ళి చేసుకోంటా నని ఖచ్చితముగా కాదు),

మరి ఉగాదికి కవిత రాయాలి కదా !

నిర్బయ మయిన మనస్సు ,అలొచలా అలోచనాని శిరస్సు 

మటుమాయమయినాయి వెలుగు నీడల తెరలు

హరించి పోయినది ప్రతి దుఖభాష్పం’

గతించి పోయాయి క్షనికానంద ఉషోదయాలు   

ఒక చిన్ని నవ్వు బుడగనినేను

అయిపోయూను ఆనంద సాగరముగా!
ఉగాది శుబాకాంక్షలు ఈ నూతన సంవత్సరం మీకు మరింత ఆనందాన్ని కలిగించాలి అని కోరుకుంటూ ….
మీ శ్రేయోబిలాషి
కృపాల్ కశ్యప్
తినేది చేదని తెలిసీ, అది ఉగాది విందని తలచి. ఇష్టపడే ఆ పూతే అలవాటైతే ప్రతి రోజూ వసంతమౌతుంది !

ఉగాది ఎప్పుడొ ? -లాంగ్‌ వీకెండ్‌ కోసం పండగనే మార్చారా !! మార్చి 16, 2007

Posted by kasyap in Uncategorized.
add a comment

నాకు అర్ధం కాని విషయం ఏమిటంటేఉగాది 20 మార్చిని కాదు, 19నే అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి శలవు ప్రకటించింది.ది ఏమైనప్పటికి పాఢ్యమి ఘడియలు ఉదయం ఉన్న వేళల్లో ఉగాది పండుగను చేసుకోవాలి వ్యయనామ సంవత్సర పంచాంగాలలో 20 వ తేదీ ఉగాదిఅని వుంది.
19
న అమావాస్య ఉదయం 8-52 వరకు (ఒక పంచాంగం ప్రకారం) వుంది. అదేరోజు సూర్యగ్రహణం ఉదయం 7-32 వరకు. సంకల్పం అమావాస్య తిథిగానే చెప్పుకోవాలి.
20
న పాడ్యమి తిథి ఉదయం 6-43 వరకు వుంది (ఒక పంచాంగం ప్రకారం). సూర్యోదయానికి పాడ్యమి వుంది కనుక సంకల్పంలో సర్వజిత్‌ నామ వత్సరే, ఉత్తరాయణే, వసంత ఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే ప్రతిపతిథౌ, భౌమవాసరే అని చెప్పుకోవాలికొత్త గా విడుదలైన సర్వజిత్‌ నామ సంవత్సర పంచాంగాలు కూడా 20 వ తేదినుంచే ఉగాదితో మొదలయ్యాయి.
మరి ఇంత హథాత్తుగా ప్రభుత్వానికి ఉగాది తేదీపై అనుమానం ఎందుకు వచ్చింది? ప్రముఖ దేవస్థానాలన్నీ కూడా 20 వతేదీనే ఉగాది పండుగ చేస్తూవుంటే మధ్యలొ ప్రభుత్వానికీ జోక్యం ఎందుకు?
దీనికి ఒకటే కారణం నాకైతే అనిపిస్తోంది. అదే వరుసగా శలవలు వస్తాయనేమోనని!!-

భరతఖండంబు చక్కని పాడియావు! జనవరి 29, 2007

Posted by kasyap in Uncategorized.
4 comments

బిగ్‌బ్రదర్‌రియాల్టీ షో కిరీటాన్ని బాలీవుడ్‌ సుందరి శిల్పాశెట్టి సొంతంచేసుకుంది. ఎన్ని  నాటకీయ పరిమాణాలు- ఇది ఊహించిందే !భారత ప్రజలారా మీకుబిగ్‌బ్రదర్‌రియాల్టీ షో  చక్కటి అవగానవచ్హి నదికదూ !!మరి ఇకనే బహూళజాతి కంపెనీల రాబడికి మరి ఇన్ని అకాశములు . ఒక పద్యము గుర్తుకు వస్తోందిభరతఖండంబు చక్కని పాడియావు—————————– (ప్రస్తుత పరిస్తితులకు ఇక్కడ భారతీయులు  అనుకోవచ్చు నేమో)

—————————-పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.అంతా

మన ఖ(క)ర్మ

బిగ్‌బ్రదర్‌రియాల్టీ షో కిరీటాన్ని బాలీవుడ్‌ సుందరి శిల్పాశెట్టి సొంతంచేసుకుంది.  ఈవిజయంతో శిల్పాశెట్టికి లక్ష పౌండ్ల ప్రైజ్‌మనీ లభించింది. ప్రారంభమైనప్పటినుండి వివాదాల నడుమ చిక్కుకున్న ఈ కార్యక్రమంలో ఆసియానుండి పాల్గొన్న తొలిసారే కిరీటం గెలుచుకోవటం విశేషం. 63 శాతం ప్రజలు శిల్పాశెట్టికి అనుకూలంగా ఓటువేశారు. జెడ్‌గూడీ ఎపిసోడ్‌ తర్వాత శిల్పాశెట్టికి ఆదరణ పెరిగింది. ఇంగ్లాడ్‌లోని ప్రముఖ పత్రికకు గూడీకి వ్యతిరేకంగా వచ్చిన 50వేల లెటర్స్‌ చూస్తుంటే శ్‌ిల్పాశెట్టికి ఉన్నఆదరణ తెలుస్తుంది. గూడీతో పాటు శిల్పపై చిర్రుబుర్రులాడిన మాజీ సుందరి డేనియల్‌ లాయిడ్‌ షో ముగిసిన తర్వాత సారీ చెప్పింది. ఈ కిరీటం దక్కిన తర్వాత శిల్పకు హాలీవుడ్‌ ఛాన్స్‌లు ఇబ్బడిముబ్బడిగా వచ్చిపడుతుండగా ఇప్పటికే రెండు సినిమాలతో ఒప్పందం చేసుకుంది. బ్రిటన్‌ పార్లమెంట్‌లో జాతివివక్ష ఆరోపణలపై చర్చజరిగిన తర్వాత ఈ షోకు విపరీతంగా రేటింగ్స్‌పెరిగాయి. ఈ షో అర్ధాంతరంగా ముగిసిపోతుందనుకున్న నిర్వాహకులకు అనూహ్యంగా రేటింగ్స్‌ పెరగటంతో ఊపిరిపీల్చుకున్నారు. ఇది ఐదవ బిగ్‌బ్రదర్‌ రియాల్టీషో. . www.telugupeople.com నుండి 

భరత ఖండంబు అనే పద్యని చిలకమర్తి వారు వ్రాశారు  భరతఖండంబు చక్కని పాడియావుహిందువులు (భారతీయులు )   లేగదుడలై ఏడ్చుచుండతెల్లవారును గడుసరి గొల్లవారు పితుకుచున్నారు మూతులు బిగియగట్టి.

ఈ సంవత్సరం పండగ నా బ్లాగు మీద! జనవరి 12, 2007

Posted by kasyap in Uncategorized.
6 comments

 Sankranthi ThoraNamu

సంక్రాంతి చలి మంటలు,భోగి కి భోగి పళ్ళు, భోగి మంటలు,గంగిరెంద్దుల వారి మేళం,హరిదాసులు,గాలి పటాలు,ముగ్గులు,గొబ్బిళ్ళుభోగి కి భోగి పళ్ళు, భోగి మంటలు,సంక్రంతి రోజు పాయసాలు, క్రొత్త బట్టలు, దేవుళ్ళ పటాలు శుభ్రం చేయటం , పసుపు, గంధం , బొట్లు అద్దటం .కనుమ కి పసువుల కొమ్మలకి రంగులు,ఒకటేమిటి. అన్నీ అన్నీ  ఈ సారి  పండుగకు చెయలనుకొన్నా  ,కొన్ని చూడాలను కొన్నా. ఈసారి పని ఒత్తిడి వలన మా గ్రామమునకు వెళ్లు ట సాద్య పడలేదు ,కాని వున్నతలో నా బ్లాగు మీద పండగచేసు కోంటుంన్నా !, నా (అ)భాగ్యనగరమందు ఈ బాగ్యము  కూడా  లేకపాయే , ఈ సారికి నాకు శిల్పారామము ఒక అరామము కావచ్చును . మిత్రులందరు వీలయితే   మీ బ్లాగులను అలంకరించండి మరి అసలె పెద్ద పండగ (సంక్రాంతి) రోజులాయె! .

మీకు భొగి, సంక్రాంతి మరియు కనుమ శుభాకాంక్షలు

మీ శ్రేయోబిలాషి

కృపాల్ కశ్యప్

Bhogi mantalu MugguEddu (more…)

మీ కంప్యూటరు ద్వారా తెలుగు వినటము (”text to speech” for Telugu) ఎలా? జనవరి 7, 2007

Posted by kasyap in Uncategorized.
5 comments

మీ కంప్యూటరు ద్వారా తెలుగు వినటము (”text to speech” for Telugu) ఎలా   ?

మీరు దయచేసి   తెరువగలరు  

Please click on this file if you are able to see image files ఉద్దేశ్యము :  తెలుగు  RTS Text ను చదివించటము  Unicode to RTS Object : Generating Telugu sounds from Telugu phonetic script కావలసిన ఉపకరణములు

1) Phonetic Tool    http://www.geocities.com/krupal_kasyap/Phonetic.zip  Please go through help menu to use this phonetic tool after installation  ఈ కింది లంకె నందు ఉచిత మరియు 

2) http://www.readplease.com/english/downloads/#rp2003  మరియు అదే పుట నందు ఇంకా కింది బాగమున ఇటలియన్ వాయస్ కూడా  దిగుమతి చేసుకోనవలయును 3) TTS engine with 2 L&H Italian voices(Male & Female) మీరు Firefox web browser వాడుతున్నచో  padma  add-on  http://padma.mozdev.org/   కూడా  దిగుమతి చేసుకోనవలయును    First open any telugu uncode supported webpage Here I took a sample  
 
After that copy required test into a Microsoft word (XP/2003/2007) 
 Activate Microsoft language bar ను Activate చెయవలెను  దీనిలో telugu mode ను Activate చెయవలెను  తరువాత Convert selection  గా  మార్చవలెను   Anaganagaa oka raajugaaru. Raaju gaariki eeduguru kodukulu.okaroojuna ii eeduguruu adavi looki veetaki veLLaaru. Veetaadi eedu ceepalani pattukoni theccaaru. Ii eedu ceepalani eMda loo eMdapettaaru. Eedu ceepalaloo aaru ceepalu maathramee eMdaayi.దీనిని Cut  చెసి Readplease lo paste చేయటమే Imp note : In read please you have to select Italian voice !  ఇది ఎలా పలుకు తున్నదో  వినవలె నంటే  www.geocities.com/krupal_kasyap/okaraju.mp3

www.geocities.com/krupal_kasyap/telugu.doc ( with pics)

మొబైల్ ఫోన్ -బాగ్యమా, భారమా ! జనవరి 2, 2007

Posted by kasyap in Uncategorized.
8 comments

కొత్త సంవత్సర శుభాకాంక్ష్లలు
ఎందుకోచాలా రోజుల తరువాత రాయాలని పించినది.

సామాన్యుల నుంచి మాన్యుల వరకూ మొబైల్ ఫోన్ అవసరంలేని వారు కనిపించని రోజులివి. ప్రపంచంలో అత్యధికంగా ఏ దేశంలో లేని విధంగా భారతదేశంలో మొబైల్ ఫోన్ల అమ్మకాలు, కొత్త కనెక్షన్ల పొందే వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది . గతంలో భారతదేశంలో ఆన్‌లైన్ సేవలు విసృతంగా జరిగితే, వాటిని మొబైల్ ఫోన్లు ఆక్రమించాయి. కాని మా వూరి కధవేరు.

 మావూరి కి పోయిన సంవత్సరమే మొబైల్ ఫోన్ సేవలు వచ్హాయి చాలామంది రైతు కూలివారు తమ స్టొమతనుబట్టి ఒక మొబైలు ఫొను కొనుక్కొనారు మరి ఫొను కొన్నతరువాత రోజుకు ఒకసారి అయినా మాట్లాడాలికదా ! .ఈ కంపెనీలు ఇచ్చే పదకాలు కు అయితెనేమి, అవసరానికి  అయితెనేమి ,అనవసరానికి అయితెనేమి మా గ్రామము లో ఫొను వాడకము భాగా పెరిగినది ఫలితము నెలకు మూదు వందల రూపాయల బిల్లు ,నా పరిశీలన  ప్రకారము అనవసర సంబాషణలే చాలా ఎక్కువ. మావూరిలో  జనాలంతా కనీసము యబై వేల రూపాయలు నెలకు ఈ కంపెనీలకు సమర్పించు కొనటనము చాలా బాదగా వున్నది.  దీనికి కారణమేమిటో నాకు బోదపడుటలేదు .  

సత్యాగ్రహము పుట్టిన రోజు : 11 September 1906 సెప్టెంబరు 11, 2006

Posted by kasyap in Uncategorized.
1 comment so far

జాతిపిత మహాత్మా గాంధీ సత్యాగ్రహము ను మానవాళికి ఒసగిన సుదిన మిది , సత్యము, అహింసలు గాంధీగారు కొలిచిన దేవతలు. సహాయ నిరాకరణ, సత్యాగ్రహము ఆయన పూజాసామగ్రి. 20వ శతాబ్దిలోని రాజకీయనాయకులలో అత్యంతముగా మానవాళిని ప్రభావితము చేసిన రాజకీయ నాయకునిగా ఆయనను CNN జరిపిన సర్వేలో ప్రజలు గుర్తించారు. కొల్లాయి గట్టి, చేత కర్రబట్టి, నూలు వడకి, మురుగువాడలు శుభ్రము చేసి, అన్ని మతాలూ, కులాలూ ఒకటే అని చాటి ఆ మహాత్ముడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించాడు. సత్యాగ్రహమూ, అహింసా పాటించడానికి ఎంతో ధైర్యము కావాలని బోధించాడు. మహాత్ముడనీ, జాతిపిత ఆనీ పేరెన్నిక గన్న ఆయన ఆంగ్లేయుల పాలననుండి భారతదేశానికి స్వాతంత్ర్యము సాధించిన వేలాది నాయకులలో అగ్రగణ్యులు.

1894లోభారతీయుల ఓటు హక్కులను కాలరాచే ఒక బిల్లును ఆయన తీవ్రముగా వ్యతిరేకించారు. బిల్లు ఆగలేదుగానీ, ఆయన బాగా జనాదరణ సంపాదించారు. “ఇండియన్ ఒపీనియన్” అనే పత్రికను ఆయన ప్రచురించారు. “సత్యాగ్రహము” అనే పోరాట విధానాన్ని ఈ కాలంలోనే ఆయన అమలు చేశారు. ఇది ఆయనకు కేవలం పని సాధించుకొనే ఆయుధం కాదు. నిజాయితీ, అహింస, సౌభ్రాత్వుత్వము అనే సుగుణాలతో జీవితం సాగించడంలో ఇద ఒక పరిపూర్ణ భాగము. గనులలోని భారతీయ కార్మికులకు జరుగుతున్న అన్యాయాలను ప్రతిఘటించడానికి ఆయన మొదలుపెట్టిన సత్యాగ్రహము 7 సంవత్సరాలు సాగింది. 1913 లో వేలాది కార్మికులు చెరసాలలకు వెళ్ళారు, కష్ట నష్టాలకు తట్టుకొని నిలచారు.

వందేమాతరం పూర్తి గీతముwritten by Bankim Chandra Chatterjee in 1876, on September 7 సెప్టెంబరు 5, 2006

Posted by kasyap in Uncategorized.
add a comment

మిత్రులారా ,

వందేమాతరం పూర్తి గీతము  ,రచించి వంద సంవత్సరాలు అయిన సందర్బముగా  అందరూ 7 వ తారీఖున మీ కార్యాల యములలో పాడగలరని మనవి చేయుచున్నాను .
మీ శ్రేయోబిలాషి
కశ్యప్

వందేమాతరం  వందేమాతరం

సుజలాం సుఫలాం మలయజ-శీతలాం
సస్య-శ్యామలాం మాతరం ||

శుభ్ర-జ్యోథ్స్నా-పులకిత-యామినీం
ఫుల్ల-కుసుమిత-ద్రుమదళ-శోభినీం
సుహాసినీం సుమధుర-భాషిణీం
సుఖదాం వరదాం మాతరం ||

షష్ఠీకోటి-కణ్ఠ-కల-కల-నినాద-కరాలే
ద్విషష్ఠికోటి-భుజై ధ్రుత-ఖరకరవాలే
అబలా కైనో మా ఐతో బోలే
బహుబల-ధరిణీం నమామి తారిణీం
రిపుదల-వారిణీం మాతరం ||

తుమి విద్యా తుమి ధర్మ్
తుమి హ్రుది తుమి మర్మ్ త్వం _హి_ ప్రాణాహ్ శరీరే ||

బాహుతే తుమి మా శక్తి
హ్రుదయే తుమి మా భక్తి
తోమారయి ప్రతిమా జడి మందిరే ||

త్వం _హి_ దుర్గా దశప్రహరణ-ధరిణీం
కమలా కమల-దళ-విహారిణీం
వాణీ విద్యాదాయినీ నమామి త్వాం
నమామి కమలాం అమలాం అతులాం
సుజలాం సుఫలాం మాతరం
వందే మాతరం |

శ్యామలాం సరళాం సుస్మితాం భూషితాం
ధరణీం భరణీం మాతరం ||