భువిపై తారలు !!-Taare Zameen Par డిసెంబరు 24, 2007
Posted by kasyap in Uncategorized.4 comments
ఊహ చాలా సార్లు వున్నదాని కన్నా మెరుగు గా వుంటుంది కోన్ని సార్లు తప్ప Taare Zameen Par ఎంత గొప్పగా తీసాడు అమీర్ ఖాన్ , రజనీకాంత్ బాబా తరువాత నేను ఇంతగా ఊ హించిన చలన చిత్రం మిదే .వాణిజ్జ్య విలువల కు లో బడి బాబా అయోమయం గా తయారనినది :(.
but same case not happend with “Taare Zameen Par” - Briliant story, script and performace! Kudos to Aamir and his team Here goes another feather in the fame hat of this perfectionist legendary actor…
ఇది dyslexic పిల్లవాడి గురించి .
ఈ సినిమా చూసిన తరువాత అనిపించినది మన బడులలో కూడా నికుంబ్ సారు (అమీర్ ఖాన్) వుంటే ఎంత బాగుంటుంది ?
నిజానికి ఇది 1985 లో రాలవ సిన సినిమా ! ![]()
ఒక గణాంకం ప్రకారం మనలో 3 నుండి 5 శాతం మౌంది డైస్లిక్షి యా తోబాద పడుతున్నట్లు అంచనా కానీ నాలాగనే చాలా మంది చిన్న తనంలో ఇది గ్రహించలేరు .
ఇది ముందు గానే మా పంతుళ్ళకు తెలిసుంటే
- నా వేళ్ళ కీళ్ళు కోంచేం సుకుమారం గా వుండేవి
- నేను ఎడవ తరగతి ఫస్టు క్లాసు లో పాసు అయిన ప్పుడు అమ్మ,నాన్న అంత దిక్క్ బ్రాంతికి లోన వకుండా వుండే వాళ్ళు కామోసు .
- చిన్న ప్పటి నుండి 10 తరగతి వరకు చూచి రాతలు రాయాలిసి న బాదతప్పే ది ( 10 తరగతి లో మా లెఖ్ఖ ల మాస్టారు తెగ బాదపడి పోయేవాడు )
- ఇంటరు లో హాయిగా M.P.C బదులు ఏ Bi.P.C నో ఎంచుకునేది
తరువాత ఈ computer వచ్చి అదుకుంది ,ఇది లేక పోతే ఎ గోడ మీదో కాగితం మీదో బోమ్మలు వేసుకుంటూ బ్రతికే వాడిని.
(ఇక్కడి దాకా చదివి న వారు నా మెదటి టపాలు చూడవలసినది గా మనవి
“
Operation flood - Hyderabad డిసెంబరు 15, 2007
Posted by kasyap in Uncategorized.5 comments
పోద్దునే మా మారేడు పల్లిలో Operation flood జరిగినది,కడవల కోద్దీ పాలను దేవుళ్ళ మీద కుమ్మరించి ఆ పాలను ఇలా రోడ్డు మీద వరదలు కట్టించటమే ఈ కార్యపుముఖ్యోద్దేశ్యము . ఇలా దేవుళ్ళ మీద పాలు కుమ్మరించటం వలన దేముడు ప్రక్షాళల పోంది మన పాపాల లను కడిగి వేస్తాడని నమ్మకం.



రాములమ్మా ఎటు నీ గమ్యం డిసెంబరు 4, 2007
Posted by kasyap in Uncategorized.5 comments
అక్కా మళ్ళీ తయరయ్యావా .ఈ మద్య కనపడక పోతే ఎమో అనుకోన్నా మళ్ళీతయారయ్యావా !!
జనాలూ కోట్టి , ఎంమెల్యే లు కోట్టి నువ్వు కోట్టి ఇలా ప్రతిఒక్కడూ కొట్టుకుంటూ పోతే పాపం ఆ డాక్టర్ ల పరిస్తితి ఎమిటీ ?. అసలు ఎమి చెద్దామని నువ్వు అక్కడికి వెళ్ళావో అసలు ఎవరు నిన్ను పిలిచారో, మోన్న వికలాంగుల ఘర్జనకు తగుదునమ్మా ఆంటు వెళ్ళావు.
ఈ సారి ఆటుగా వెళ్ళినప్పుడు పాలు,టమాటాలు గుడ్లు తీసుకోని వెళ్ళు పాలు పిల్లలకు టమాటాలు, గుడ్లు పెద్దలకు .
హా…తీసుకు వెళ్ళటమంటే గుర్తుకు వచ్చింది నా పెళ్ళికి రాదాకృష్ణుల ప్రతిమలు 17 . వినాయుకుడి ప్రతిమలు 13 వచ్చాయి :( ………. వీళ్ళకి ఎందుకింత పగో !!
లింగ వివక్ష ధోరణి అక్టోబర్ 29, 2007
Posted by kasyap in Uncategorized.add a comment
ఈ రోజు మన భాగ్యనగరం లోజరిగే ఆసియా ఫసిఫిక్ కాన్ఫరెన్స్ ఆన్ రిప్రొడక్టివ్ అండ్ సెక్సువల్ హెల్త్ అండ్ రైట్స్ జరుగుతున్న సదస్సు కు వెళ్ళే అవకాశం లబించినది, ఇందులో ,1300 మంది 52 దేశాలనుండి పాల్గోన్నారుఈ దీనిన్లో మూడవ వంతు మంది యువజనులు , చర్చ ప్రదానంగా లింగ నిష్పత్తి, వైవాహిక వ్యవస్థ , లైంగక హక్కుల మీద జరిగినది .
విషయం ఎమింటంటే జనాభాలో స్త్రీల సంఖ్య క్రమేపీ తగ్గుముఖం పడుతోంది. ఈ పరిణామం కుటుంబ్‌వ్యవస్థ విచ్ఛిన్నానికి దారి తీసే ప్రమాదం వుంది. స్త్రీతో వివాహం కోసం పురుషుల మధ్య భీకర పోరాటం సాగుతుంది. ఈ పరిస్థితి బహు భర్తృత్వానికి దారితీసే అవకాశం ఉంది. లింగ నిష్పత్తిలో వస్తున్న ఈ అంతరం రెండు మూడు దశాబ్దాల తర్వాత సమాజంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఆదాయపు వనరుగాను,కుటుంబ బారంమోసే వాడిగాను, చేసేవాడిగాను సమాజంలో మగ బిడ్డకు ఉన్న ప్రాధాన్యం కారణంగా క్రమేణా ఇలాంటి అసమానతకు దారితీయనున్నది. భారత్ తోపాటు పాకిస్తాన్, చైనా, వియత్నాం, నేపాల్ దేశాలలో కూడా ఇదే పరిస్థితి .
చాలా మంది వక్తలు ఈలింగ నిష్పత్తి గురించి ఆందోళన వ్యకం చేశారు .
కానీ నాకు అర్దంకానివి కోన్నివున్నాయి
ఈ సెక్సువల్ హెల్త్ అండ్ రైట్స్ అన్నీకూడా స్త్రీల గురించి వారి సమస్యలగురించి మాత్రమే వున్నయి,
అంటే పురుషులకు ఇలాంటివి హక్కులు వుండకూడదా ?
“Sexuality does not operate in isolation. It intersects gender, class, caste, religion, economics, law, culture and many other variables. We need to acknowledge that all people are not heterosexual and can have different preferences. Everyone including lesbians, gay men, bisexuals, transgendered, transsexual have a right to be safe from violence and discrimination and enjoy their sexuality,””
గణాంకాల ప్రకారం అలోచింస్తే నేడు ప్రతి 1000 పురుషులకి 927 మంది స్త్రీలు వున్నారు , భ్రూణ హత్యలు, ఆడ శిశు మరణాల రూపంలో లింగ వివక్ష ధోరణి (ప్రీ నాటల్ సెక్స్ డిటర్మినేషన) ద్వారా చనిపోతున్న వారిసంఖ్య 20 % మనం వీటిని నిరోదిస్తే ఒక ఐదు సంవత్సరాలలో ఈ సంఖ్య 1000 పురుషులకి 1150 మంది స్త్రీలు వుంటారు .
దీనివలన సమాజిక అసమానతలు కలగవా ?
ప్రతి ఒక్కరూ సెక్స్ గుంరించి యుక్తవయసు లోనే ( 13 - 17 ) జ్ఞానం అందించాలి ( Sex Education )అని తత్ద్వారా స్త్రీలపై లైంగిక అత్యాచారాలు తగ్గుతాయి అని అంటున్నారు , నా అవగాహన ప్రకారం యుక్తవయసు లో విచక్షణా జ్ఞానం కన్నా లైంగిక అవసరాలకే ప్రాముఖ్యత వుంటుంది మనం అందిచే ఈ జ్ఞానం , గర్బనిరోదక పద్దతులకు , HIV లాంటి సుఖవ్యాదులు బారిన పడకుండా వుండటానికి , పరస్పర అవగాహన పెరగటానికి (బల వంతపు అత్యాచారాలు తగ్గటానికి )వుపయోగ పడుతుంది .
ఇది చాలా సున్నితమయిన అంశం యుగాల దాదాపు అన్ని దేశాలలోను ,మతము , సంసృతి లోను పెద్దగా ప్రాముఖ్యత ఇవ్వలేదు ఎందుకంటే అది ఇంత గా ఆవయసు లో తెలుసుకోకపోవటం వలన వచ్చేనస్టమేమి లేదు ఎందుకంటే ఇది ప్రకృతి సహజసిద్దం గా ఆ జ్ఞానం ఇస్తుంది, ఒక వేళ ఇది మంచిదే అయినా ఒక వ్యక్తి నైతికంగా, ఉన్నత వ్యక్తితంతో ఎదగటానికి ఇది ఎంతవరకు ఉపయోగం ?

గోప్పోళ్ళ గోత్రాలు అక్టోబర్ 22, 2007
Posted by kasyap in Uncategorized.1 comment so far
పాపలూ , బాబులూ .. పెద్దల గౌరవాన్ని క్షణిక కాలంలో బ్రస్టు పట్టించటం, మీడియా (ముందు) విచక్షణా జ్ఞానం లేకుండా మాట్లాడటం తుపాకును బహిరంగా ప్రదర్సించటం దీనిని మీడియావాళ్ళు అదే పనిగా ప్రచారం చేయటం
ఇక మలాంటి వారికేమో మీ గురించే చర్చికుంటూ బెరీజువేసుంకుంటూ.. మీ పెద్దల కన్నామంచి వినోదంపంచుతున్నారు
భళి భళి ..మీరంతా ఒకనాడు మీప్రస్థానాన్ని ఎలా మొదలు పెట్టారు, ఎక్కడ నుంచి ఆరంభించారు, ఎక్కడ నుంచి ఎక్కడకు ఎదిగారు? , ఎక్కడకు దిగారు?.
నేను ఈ మద్య విన్నవి కోన్ని
” వాడి ఉసురు తగలబట్టే ఇలా అయింది …అందుకనే ..”
” నీకు ఒక కూతురు వుంటే..”
” సన్ స్ట్రోక్ ..”
” గల్లీనుండి డిల్లీదాకా …”
” బాబాయంటే భయ్యం ..”
” కోడితే కొట్టాలి రా..”
” బలే ట్రాప్ చేసిండు మామా..
ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు అక్టోబర్ 16, 2007
Posted by kasyap in Uncategorized.27 comments
నాకు పెళ్ళి ఒద్దు మొర్రో అంటే వింటారా .
నాకు పెళ్ళిచూపులకు ముందే లగ్నానికి ముహుర్తం నిర్ణయించి పిలిచారు
నా ఆదర్శాలకు పెళ్ళిఎలా అడ్డో ఒక పది కారణాలు చెప్పమన్నారు .
ఒక అనుకోని పరిణామాన్ని ఎదుర్కోవలసి వచ్చింది - చెప్పలేక పోయాను
చెప్పింది చేయమన్నారు
చివరకు పోయిన శనివారం ఇలా డిసైడ్ చేసిండ్రు.. 11-11 న 11 గంటలకు జన జీవన స్రవంతిలో కలుపుతారట ..

చూసారా …దీపము నుండి వచ్చే వెలుగుని ఆగష్టు 31, 2007
Posted by kasyap in Uncategorized.3 comments
ప్రేమికులదినం 14th Feb 2006 - See if you can change your thinking!!! అటూ అంతర్జాలము లోకి అడుగుపెట్టి,పిండి వంటల రుచిని Hyderabad Masti కి రుచి చూపించి అటు పిమ్మట బ్లాగా వరణము లోనికి పవేశించి ఇంతితై .. నేడు వలబోజు జ్యోతిగారు ఏక కాలంలో ఐదు బ్లాగులు అదీ 1000 పైచిలుకు టపాలు! .Hyderabad Masti గూగుల్ గుంపు లోవున్న 10460 మందికి మన గుంపులో 811 మందిలో ఒక ప్రత్యేక మయిన విశిష్టతను సంపాదించుకున్నారు.
Date:26/6/06
కంప్యూటర్ ఎరా పత్రికలో వచ్చిన వ్యాసం చదివిన తరువాత అని పించినది తెలుసుకోవాలన్న ఆసక్తి దాని తగిన కృషి చాలు విజయానికి ,ఇలా వివిధ అంశాలపై అమితమైన ఆసక్తిని చూపే జ్యోతిగారు అనేక మంది కి స్పూర్తి దాయకం ,కృషి కొనసాగాలని కోరుకొంటూ అభినందనలు తెలియజేస్తూ
ఒకసారి మననం చేసుకోందాం
ఉపయోగించకపోతే
కత్తి తుప్పు పడుతుంది!
వినియోగించకపోతే
మేధ తప్పుల పడుతుంది!!
గమనం ఉంటేనే కద -
గమ్యం అందేది!
పఠనం చేస్తేనే కద -
ప్రతిభను పొందేది!!
వట్టిగా ఉంటే
మట్టిలో చెదవవుతావు!
గట్టి కృషి ఉంటే
చేవ గల ప్రగతివవుతావు!!
కృషి కొనసాగాలని కోరుకొంటూ అభినందనలు తెలియజేస్తూ
స్వతంత్ర భారతం అరవై ఎళ్ళు నిండిన వేళ తోటి భారతీయులందరికీ శుభాకాంక్షలు ఆగష్టు 14, 2007
Posted by kasyap in Uncategorized.1 comment so far
ఏ దేసమేగిన, ఎందుకాలిడిన
యే పీఠ మెక్కినా, యెవ్వరెదురైన
పొగడరా, నీ తల్లి భూమి భారతిని
నిలుపరా, నీ జాతి నిండు గర్వమ్ము
లేదురా ఇటువంటి భూదేవి యెందు
లేరురా మనవంటి పౌరు లింకెందు-
యే పూర్వపుణ్యమో, యే
యోగబలమొ,
జనీంచినాడ వీస్వర్గలోకమున
యే మంచిపూవులన్
బ్రేమించినావొ
నిను మోచె, నీ తల్లి
కనకగర్భమున
సూర్యుని వెలుతురు
సోకునందాక
ఓడలజెండాలు ఆడునందాక
నరుడు ప్రాణాలతో నడచునందాక
అందాక గల ఈ యనంతభూతలిని
మనభూమి వంటి కమ్మని
భూమిలేదు-
తమ తపస్సులు ౠషుల్
ధారబోయంగ
చండవీర్యము
శూరచంద్రులర్పింప,
రాగదుగ్ధము భక్తరాజు లీయంగ
భావసూత్రము కవిభంధవు లల్ల,
దిక్కుల కెగదన్ను తేజంబు వెలుగ
జగముల నూగించు మగతనంబెగయ,
రాలు పూవులు సేయు రాగాలు
సాగ సౌందర్య మెగబోయు సాహిత్య
మొప్ప-
వెలిగిన దీ దివ్య విశ్వంబు పుత్ర
దీపించె నీ పుణ్యదేశంబు పుత్ర;
అవమాన మేలరా, అనుమాన మేల
భరతపుత్రుడ నంచు భక్తితో బలుక-

ఎంటీ తాజ్‌మహల్‌కు ఓటెయ్యాలా ? జూన్ 25, 2007
Posted by kasyap in Uncategorized.2 comments
ఎంటీ ప్రపంచంలోని ఏడు వింతల్లో చోటుదక్కటానికి తాజ్ కు ఓటెయ్యాలా - ఇది ఒక ప్రైవేటు చిట్టా దీనికి ఎటువంటి అధికారం లేదు - నేను వెయ్యను , తాజ్‌మహల్‌కు ఓటెయ్యాలా - ఇది ఒక ప్రైవేటు చిట్టా దీనికి ఎటువంటి అధికారం లేదు - నేను వెయ్యను ,
ఈ మద్య ఇది బాగాపెరిగి పోయినది “ప్రపంచంలోని ఏడు వింతల్లో భారత్‌కు చెందిన చారిత్రాత్మక కట్టడం తాజ్‌మహల్‌కు చోటు దక్కుతుందా అనే విషయం ఆగమ్యగోచరంగా ఉంది. ఇందుకు కారణం ఇటీవల నిర్వహిస్తున్న ఆన్‌లైన్ సర్వేలో ప్రస్తుతం ఉన్న ఏడు వింతలపై ప్రజాభిప్రాయ సేకరణ తాజ్‌మహల్‌కు భిన్నంగా ఉండటమే. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 200 కట్టడాలపై నిర్వహిస్తున్న సర్వేలో మొత్తం 21 కట్టడాలు తుదిగా నిలిచాయి. ప్రస్తుతం ఏడో వింతగా ఉన్న తాజ్‌మహల్ ఆ జాబితా నుంచి తప్పుకుంది. అయితే తాజ్‌మహల్‌కు ఓటు వెయవలసినది గా అబ్యర్దిస్తూ జాబులు SMS వస్తున్నాయి.అసలు ఈ ఓటంగ్ సరళి చాలా విచిత్రంగా ఉన్నది దీని కోసము మీకు Internet accout గాని Mobile Phone గాని వుండాలి
, మీకు ఓటు వెసిన రుజువు కోసం Certificate voting కు US$2,లేదా దీనికో సము +423 663 90 02 99 call చేయాలటలేదా on line లో, ఎన్ను కోవాలట ,SMS ద్వారా కూడా ఎన్నుకో వచ్చట అన్నిపక్రియలు వ్యయపూరిత మయినవి పైగా ఇది ఒక వ్యక్తిగత చిట్టా ఇలా మనం ఎవరన్నా చిట్టాలు తయారు చేయవచ్చు ఇలాంటివి వుపయోగించి ప్రజల మానసిక ఉద్వేగాలను చక్కగా సోమ్ము చేసుకోవచ్చు ఇంకా బోలేడు జాబితా (data), ప్రచారం కూడా లబిస్తుంది. ఇక విషయానికి వస్తే ఈ ఓటింగు పూర్తి గా ఒక గిమ్మిక్కు ,ఇది ఒక swiss కంపెనీ వాడి మాయ వీడు http://www.new7wonders.com/ పేరుతో ఒక టూర్ నడుపుతూ ఉంటాడు వీడు మన తాజ్‌మహల్ అబివ్రుద్దికి ఒక్క డాలరు కూడా ఇవ్వడు అంతే కాక దీనిపై సర్వే నిర్వహిస్తున్న బెర్నార్డ్ వెర్బర్ చెపితేనే తాజ్‌మహల్ కు కోత్తగా వచ్చేదేమి లేదు , అసలు UNESCO వాడికే మన తాజ్ గురించి మాట్లాడే అధికారంలేదు.ఇలాంటి పనికి రానివిషయాలి మీద మన మీడియా ప్రత్యేక మమకారం అసలు ఒక విషయంగురించి మాట్లాడేటప్పుడు సరి అయిన పరిశోదన చేసి విచక్షణ తో ఎందుకు స్పందించరు ? ఖర్మకాలి మన ప్రర్యాటక మంత్రి అంబికా సోని గారు మీడియా సమక్షలో SMS ద్వారా ఓటు వేసారు ఆ మూడు రూపాయలను తాజ్‌మహల్ అభివృద్దికి వెచ్చించినా ఈపాటికి కోన్నిలక్షల రూపాయలు జమఅయ్యేవి .
PS : ఇది రాసే సమయానికి Lisbon వాడు తుదిజాబితా ప్రకటించటానికి ఇంకా 11 రోజుల 11 గంటల సమయం మిగిలి వున్నది.దయచేసి ఈవేలంవెర్రి గురించి be MAD! (Make A Difference )
పందులే గుంపుగా వస్తాయి…సింహం సింగిల్‌గా వస్తుంది జూన్ 15, 2007
Posted by kasyap in Uncategorized.6 comments
ఓ ఎన్.ఆర్.ఐ. అమెరికాలో సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఆర్కెటెక్ట్‌గా ఉంటూ రూ.250 కోట్లు సంపాదించి స్వదేశానికి తిరిగివస్తాడు. తాను సంపాదించిన సొమ్ముతో ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనీ, ఓ యూనివర్శిటీ, ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వంటివి నిర్మించి ఉచిత విద్యావైద్య సదుపాయాలు కల్పించాలన్నది అతని ఆశయం. ఎన్.ఆర్.ఐ.కి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటారు. సంప్రదాయంగా ఉండే అమ్మాయిని చేసుకుంటానని ఎన్.ఆర్.ఐ.చెబుతాడు. ఒక అమ్మయిలో అలాంటి లక్షణాలే కనపడటంతో ఆమెను ప్రేమిస్తాడు. ఇక ఫౌండేషన్ ఏర్పాటు విషయంలో తనకు సహకరించాల్సిందిగా ఒక బిజినెస్‌మెన్ ను ఎన్.ఆర్.ఐ.అడుగుతాడు.ఉచిత విద్య, వైద్యం అందిస్తే తన విద్యావైద్య సంస్థలు మట్టికొట్టుకుపోతాయనే భయంతో ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎన్.ఆర్.ఐ.కి అడ్డుతగులుతాడు. అతని కుట్ర కారణంగా ఎన్.ఆర్.ఐ. తన ఆస్తులన్నీ పోగొట్టుకుని పాపర్ అవుతాడు. దాంతో ఎన్.ఆర్.ఐ.ని హేళన చేస్తూ ఓ రూపాయి ముష్టిగా పడేసి బిచ్చమెచ్చుకుని బతకమని ఆ బిజినెస్‌మెన్ సలహా ఇస్తాడు. అదే రూపాయి పెట్టుబడిగా తన ఆశయాన్ని సాధించుకుంటానని ఛాలెంజ్ చేసిన ఆ ఎన్.ఆర్.ఐ.బ్లాక్‌మనీ దాచిన ఘరానా పెద్దమనుషుల ఆటకట్టిస్తాడు. ఈ క్రమంలోఆ బిజినెస్‌మెన్ పై ప్రతీకారం తీర్చుకొని తన ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ లక్ష్యం నెరవేర్చుకోంటాడు ….
ఇది ఎన్నాళ్ళ నుండో ఎదురు చూచిన కద ,
మళ్ళా దీనికి 75 కోట్లు ఎందుకు ?
టిక్కెట్ల కోసంవారంరోజులు పడిగాపులు ఎందుకు ?
నాకెందుకో బాబానే నచ్చినది (దాని కోసమయితే మద్రాసు నుండి కాలేజి మానుకోని అంద్రావచ్చి చూశా!)
ఇంకా నయం ఈ సినిమా చూసినది రేడియో మిర్చి వాడి సౌజన్యంతో కాబట్టి పెద్దగా బాదలేదు …..
ఇంకోక విషయం ఎమిటంటే నేను సింగిల్‌గానే వెళ్ళా …..








