హమ్మయ్య ఒక ఘట్టం ముగిసినది,
ఈ సారి ఎన్నికలు వాడి గా వేడి గా కన్న అలా జరిగినట్లు చూపబడినాయి ,ఈ సారి మీడియా ప్రభావం విపరీతంగా పెరిగినది నాకు తెలిసినంత వరకు ప్రతి మీడియా (పత్రికలు,చానెళ్ళు) పోటీలు పడిమరీ పని చేశారు త్రిముఖ పోటీ జరగటం వలన వీరికి కావలసినంత విషయం దోరికిన్నీ దురదుస్టవశాత్తు ఎదీ కూడా
నిస్పక్షపాతంగా వ్యవహరించలేదు. ఎన్నికల సంఘం నియమావళి దెబ్బకు నాలాటి ఓటరుకు పోలింగ్ బూతుకు వెళ్ళి అక్కడ పట్టిక చూశేదాక అసలు ఎంత మంది అబ్యర్దులు వున్నారో తెలియకుండా పోయినది ఇక తెలుగు వార్తా చానెళ్ళ లో మాత్రము ఏది చూసినా ఒక 20 మంది పార్టీల ఎజంట్లు అయా పార్టీల తరుపున వకల్తా పుచ్హుకోని ఇంకా నాగేశ్వర్ వంటి తటస్తులు వీరి అరుపులు వారి విశ్లేషణలు మద్యలో యానిమేషన్ వ్యంగాస్త్రాలు , మద్య లో ఇంటి కే ఉచితంగా పత్రికలు ఇవి కాక ఓటు వేయండహో అంటూ వివిధ ప్రకటనలు అంతా ఎదో అయో మయంగా నడిచినది , ఎవరు ఏది చెపుతున్నారో ఏది నమ్మాలో నమ్మకూడ దో తెలియని పరిస్తితి . ఈ పోలీసు పహరా మూలం గా బస్తీ లలో తప్ప ఇంక ఎక్కడా తాయిలాల పంపిణీ జరగని పరిస్థితి దీని వలన అబ్యర్దులు లాభ పడ్డారు ప్రజలు ప్రస్తుతానికి నష్టపోయారు ఇహ పోలింగ్ రోజు నకూడా పెద్దగా హడావిడి కనిపించలేదు ఎక్కడో జరిగిన అరకోర విషయాలనే మీడియా విపరీతంగా కవర్ చేసినది ఉదాహరణకు నేను మోతీ నగర్ లో ఓటు వేస్తునప్పుడు అక్కడకు జయప్రకాష్ వచ్హి ఎదో ఇంటర్వు ఇవ్వబోయాడు అక్కడే వున్న కాంగ్రేసు వారు ఇక్కడ పోలింగ్ వద్ద కాకుండా బయట పెట్టు కోనవలసినది గా సూచించారు దీని పై కేవలం 3 నిమిషాలు వాగ్వివాదం జరిగినది తరువాత జయప్రకాష్ వెళ్ళిపోయాడు , ఓటు వేసి ఇంటికి వచ్హి టీవీ పెడితేఅన్ని తెలుగు వార్తా చానెళ్ళ లో “మోతీ నగర్ లో జే.పీ పై కాంగ్రేసు వర్గీయుల దాడి అని ఫ్లాష్ వస్తోంది !








