మద్య అనేక బ్లాగులో వ్యవస్థ మీద అనేక సూచనలు చూస్తున్నాను , నాకు ఎప్పటి నుండో వున్న అభిప్రాయం మీతో పంచుకోవాలని ..
150 సం క్రితం వరకు ప్రధాన వృత్తులు మానవుడి కనీస అవసరాల మీదే కదా , వ్యవసాయం వాటి ఉత్పత్తు ల మీద వ్యాపారం ఈ కనీస అవసరాలు తీరిన వాడికి వినోదం వీటి కోరకు అనేక యుద్దాలు వీటి అంతామూలం బ్రతకటం బ్రతికిన తరువాత చావటం ఇందులో చావటం ని ఎదుర్కోనటానికి అనేక విదాలుగా మనిషి ప్రయత్నించాడు ఈ క్రమంలో దేవుడిని సృస్టించాడు చావు కి భయపడే వారికి చావు తరువాత కూడా జీవితం వుండోచ్హని ఆశ పెరిగినది ఆ దీనిని సమాధాన పరుచుటకు ఒక తెగ బయలు దేరినది వీరు మనిషి కోరికలను చేతనయిన విధముగా పరిష్కరింటానికి ప్రయత్నించారు సఫలమైతే దైవం అన్నారు కాక పోతే విధి అన్నారు కారణం పాపము అన్నారు ఎవరైనా ఆటంకపరిస్తే వారిని రాక్షసులు అన్నారు . ఇలా సమాజంలో అవసరాలకు తమకు తోచిన ఎర్పాటు చేశారు ఎవరు ఏపని చేయాలో ఎది చేయకూడదో చెప్పటాకి ఒక వ్యవస్థతయారు చేసారు అయితే ఇందులో ప్రజల అసంతృప్తి బయట పడకుండా ,విప్లవాలు రాకుండా వర్ణవ్యవస్థను విద్యావస్థను అదుపులో వుంచుకోన్నారు ఇలా ఈ వ్యవహారాన్ని అనేక వందల (వేల)సంవత్నరాల పాటు సమాజానికి దిశానిర్దేశ్యం చేయటాకి ప్రయత్నించారు ఈ మద్యకాలం లో కొంత మంది దీనికి వ్యతిరేకంగా కొంత మంది అనుకూలంగా పోరాటాలు చేశారు గెలిచారు/ఓడిపోయారు గత వందసంవత్సరాల నుండి దీనిని వ్యతిరేకించేవారు పెరిగి పోయారు వర్ణవ్యవస్త కులాలు తెగిపోయాయి అనేక వేలసంవత్సరాలో సాధించిన విజ్ఞానాన్ని ఈ వందసంవత్సరాల లో అనేక రెట్లు అధికమించాము కాని బ్రతుకు ఇంకా దుర్భలంగానే వున్నది ఇది ఎప్పటికి బాగవునో …అసలు బాగవునో ..అసలు తెలియకుండావున్నది








