శివ రాత్రికి పూజామాగ్రి కై సికింద్రాబాదు మార్కెట్టు వెళితే ఇది లభించింది ,నేను ఆమద్య తెలుగు పఠము కోసం అంతర్జాలంలో వెతికే దోరక లేదు అందుకే ఇది అందుబాటు లోకి తేవటానికి ఒక చిన్న ప్రయత్నం పెద్దది గా కావాలనుకోంటే దయచేసి http://picasaweb.google.com/lh/photo/YXUmIpols6VmiHqDI3MDiw?feat=directlink ఈ చిత్రం ను భద్రపరచి కావలసిన పరిమాణం లో ముద్రించుకోగలరు

ఆంగ్లలో దోరికే Snakes and ladders కన్నా మన తెలుగు పఠమే బాగుంటుంది ఇది dice కన్నా గవ్వలలో ఆడితేనే మజా..
చిన్న ప్పుడు తెగ ఆడేవాడిని,ఒక రకం గా ఇది వ్యక్తిత్వ వికాశానికి మార్గదర్శకం ఈ పటాన్ని చూడండి
సుగుణం అనే నిచ్హెన ద్వారా సాలోక్యము , గురు బోద ద్వారా దేవలోకం అలాగ నే ఆన్ని గడులు పూర్తిచేసినా చివరి గడి 121 అహంకారము లో పాము కరిచి చివరికి రాక్షసుడి గడి కి చేరతాడు దీన్ని మరింర మెరుగులు దిద్ది ఒక ఆన్ లైను గేములా తయారు చేయాలి http://www.freevbcode.com/ShowCode.asp?ID=6709 ఇలాగే ఇలాంటివి ఎన్నో ఆటలు వెలుగు లోకి తీసుకురావసిన అవసరంవున్న ది http://en.wikipedia.org/wiki/Snakes_and_ladders లోచూడండి ఇలా తెలుగు వికిలో ఇలాంటి మన తెలుగు ఆటల గురించి రాయవలసిన అవసరం వున్నది. మోన్న ఒక ప్రముఖ తెలుగు బాలశిక్షలో చూశాను మన చిన్నప్పటి నుండి నేర్చుకోన్న పాటలు పద్యాలు, ఇంకా అనేక విషయాలమీద ఆ గ్రంధ రచయిత కాపీ రైటు వేసుకోన్నాడు . ఇక మన పరమ పద సోపాన పఠము కూడా ఎవడో తర్జుమా చేసి ఒక గోప్ప ఇన్నోవేషన్ గా కాపీ రైటు వేసుకోంటాడు మనం మేమో మన ఆటకు అంత పేరు ఆనంద పడి వాడి ద్వారా వచ్హినందుకు భాధపడతాం !
మహా శివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు








