jump to navigation

మనమే ఎందుకిలా ? ఫిబ్రవరి 12, 2008

Posted by kasyap in Uncategorized.
trackback

మనమేమో
ఉడిపి హోటల్ లోనే  టీ ,తాగుతాం
అయ్యర్ హోటల్ లో ఆంద్రాపెసరట్టు తింటాం
లేక పోతే ఏ పంజాబీ దాబాకో వెళతాం .

సాయంత్రం పానీపూరీ కానీ ,పావుబాజీకానీ  తింటాం
మన రాజధానిలో  హుర్ద్దూ గానీ,ఆంగ్లంగానీ మాట్లాడతాం
ప్రక్కరాస్ట్రం వాడంటే తగని మక్కువ .
చెన్నై ,బెంగుళ్ళూరు,పూనే లో రియల్ ఎస్టేట్లకు అదారంమనమే.
35 % ఐ.టి మంనదే !.అదిక శాతం ప్రర్యాటక అదాయానికి కారణం మనమే !
వారేమో 
మన తెలుగు  అక్షరం కనపడితే రంగులు పూస్తున్నారు :( 
ఎందుకిలా ?

వ్యాఖ్యలు»

1. వల్లూరి. - ఫిబ్రవరి 12, 2008

తెలుగు వాడి తెగులు, ప్రక్క వాడి పైత్యం. ఇంత కన్నా ఏమి చెప్పమంటారు?

2. నవీన్ గార్ల - ఫిబ్రవరి 12, 2008

తెలుగు వాళ్ళే తెలుగు తల్లిని తల్లిగా అంగీకరించక….తెలంగాణా తల్లి అని సృష్టించి విభేధాలు తెస్తున్న కాలమిది. ఇక ఆ మరాఠీ వాళ్ళను తప్పుపట్టి ఏమి లాభం?

3. చైతన్య క్రిష్ణ పాటూరు - ఫిబ్రవరి 12, 2008

ఎందుకేమిటి. మెత్తగా వుండే వాడ్ని చూస్తే మొత్తబుద్దవుతుందని సామెత వుంది. మీరు వినలేదా. మన రాష్ట్రంలో దేవుళ్ళు తక్కువయ్యారని మన జనం షిరిడీకి, శబరిమలకు వెళ్ళి వాళ్ళ పర్యాటక రంగాన్ని వృద్ది చేస్తారు. వాళ్ళేమో మన అక్షరాలు కనపడితే చాలు మండిపడతారు. అక్షరాలేమిటి, మన మొహాలకే మసి పూసినా అడిగేవాళ్ళెవ్వరూ లేరని వాళ్ళకి కూడా తెలుసు.

4. చదువరి - ఫిబ్రవరి 12, 2008

మనవాళ్ళిక్కడ తస్లీమా నస్రీన్ మీద దాడి చేసారే.. అలంటిదే ఇడీనూ! పైకి మాత్రం మత దూషణ, భాషాధిపత్యం. అసలు కారణం మాత్రం - రాజకీయపు టాధిపత్యపు పోరు.
అదో పోటీ.
ఓ పూనకం.

5. అమృతరష్మి - మార్చి 24, 2008

మన భాషను, సొంత సంస్కృతిని గౌరవించలేని అధమ స్థితి మన ఆంధ్రులది. విశ్వామిత్రుని శాపం నిజమే కామోసు.