పందులే గుంపుగా వస్తాయి…సింహం సింగిల్‌గా వస్తుంది జూన్ 15, 2007
Posted by kasyap in Uncategorized.trackback
ఓ ఎన్.ఆర్.ఐ. అమెరికాలో సాఫ్ట్‌వేర్ సిస్టమ్ ఆర్కెటెక్ట్‌గా ఉంటూ రూ.250 కోట్లు సంపాదించి స్వదేశానికి తిరిగివస్తాడు. తాను సంపాదించిన సొమ్ముతో ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ ఏర్పాటు చేయాలనీ, ఓ యూనివర్శిటీ, ఓ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి వంటివి నిర్మించి ఉచిత విద్యావైద్య సదుపాయాలు కల్పించాలన్నది అతని ఆశయం. ఎన్.ఆర్.ఐ.కి పెళ్లి చేసి తమ బాధ్యత తీర్చుకోవాలని తల్లిదండ్రులు అనుకుంటారు. సంప్రదాయంగా ఉండే అమ్మాయిని చేసుకుంటానని ఎన్.ఆర్.ఐ.చెబుతాడు. ఒక అమ్మయిలో అలాంటి లక్షణాలే కనపడటంతో ఆమెను ప్రేమిస్తాడు. ఇక ఫౌండేషన్ ఏర్పాటు విషయంలో తనకు సహకరించాల్సిందిగా ఒక బిజినెస్‌మెన్ ను ఎన్.ఆర్.ఐ.అడుగుతాడు.ఉచిత విద్య, వైద్యం అందిస్తే తన విద్యావైద్య సంస్థలు మట్టికొట్టుకుపోతాయనే భయంతో ప్రభుత్వంలో తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఎన్.ఆర్.ఐ.కి అడ్డుతగులుతాడు. అతని కుట్ర కారణంగా ఎన్.ఆర్.ఐ. తన ఆస్తులన్నీ పోగొట్టుకుని పాపర్ అవుతాడు. దాంతో ఎన్.ఆర్.ఐ.ని హేళన చేస్తూ ఓ రూపాయి ముష్టిగా పడేసి బిచ్చమెచ్చుకుని బతకమని ఆ బిజినెస్‌మెన్ సలహా ఇస్తాడు. అదే రూపాయి పెట్టుబడిగా తన ఆశయాన్ని సాధించుకుంటానని ఛాలెంజ్ చేసిన ఆ ఎన్.ఆర్.ఐ.బ్లాక్‌మనీ దాచిన ఘరానా పెద్దమనుషుల ఆటకట్టిస్తాడు. ఈ క్రమంలోఆ బిజినెస్‌మెన్ పై ప్రతీకారం తీర్చుకొని తన ఎన్.ఆర్.ఐ. ఫౌండేషన్ లక్ష్యం నెరవేర్చుకోంటాడు ….
ఇది ఎన్నాళ్ళ నుండో ఎదురు చూచిన కద ,
మళ్ళా దీనికి 75 కోట్లు ఎందుకు ?
టిక్కెట్ల కోసంవారంరోజులు పడిగాపులు ఎందుకు ?
నాకెందుకో బాబానే నచ్చినది (దాని కోసమయితే మద్రాసు నుండి కాలేజి మానుకోని అంద్రావచ్చి చూశా!)
ఇంకా నయం ఈ సినిమా చూసినది రేడియో మిర్చి వాడి సౌజన్యంతో కాబట్టి పెద్దగా బాదలేదు …..
ఇంకోక విషయం ఎమిటంటే నేను సింగిల్‌గానే వెళ్ళా …..









maakevari saujanyaM lEdEmi?
ఇంతకి సినిమా పేరు ఎంటొ? మాకు ఫ్రీ టిక్కెట్లు దొరుకుతాయా?
హయ్యో! తెలియ లేదా? శివాజీ
నాకు నచ్చిందండి సినిమా…
75కోట్లెందుకా..అదేం ప్రశ్న
రజనీకాంత్ - 20 కో
శంకర్ - 10కో
రజనీకాంత్ మేకప్ - 5కో
విదేశాల ఖర్చు - 5కో
పాటకో - 2కో
హోటళ్ళ ఖర్చు - 5కో
మిగిలింది పోస్టు ప్రొడక్షన్, పబ్లిసిటీ, CNN-IBN, NDTV ఖర్చు
75కోట్లెందుకా..అదేం ప్రశ్న
50 నల్లవి 25 తెల్లవి!!!