సరిఅయిన చర్యలు ఎమిటో తెలుసుకోవాలని ఉంది !

బాంబుదాడి తీవ్రవాదుల పనే అని స్పస్టంగా తెలిసినా కూడా శనివారం బందుకు పిలుపు నివ్వటం మరీ విడ్డూరం-”నో రీజనింగ్‌ ఇన్‌ పాలిటిక్స్‌”

మానవతా విలువలు మటుమాయమై మతం అన్నపదానికే
పెడార్ధాలు వర్ణిస్తూ మతకలహాల అగ్నిజ్వాలలు రేపుతున్న
ఈ సమాజం, ఇదేనా మనసమాజం!        
అనుకోని ఆపద వచ్చినపుడు బాధితులను ఆదుకోవలసిందిపోయి, నిరసన తెలుపడం కోసం బంద్‌కు పిలుపునివ్వడం సమంజసంగా లేదు.దానికి తోడు మీడియాలో పదే పదే ప్రసారాలు భవంతి మీద దాడి జరిగిందన్నప్పుడు ప్రజల సైకాలజీ వేరే వుంటుంది, ప్రార్దనా మందిరం మీద దాడి జరిగిందన్నప్పుడు వారి సైకాలజీ వేరే వుంటుంది.జనాలను రెచ్చగోట్టి పబ్బంగడుపు కోవటంలో వీరిని మించిన వారు లేరు.మెరుగయిన సమజం కోరకు పాటు పడుతున్నామంటూ వున్న సమాజాన్ని రెచ్చగోట్టే చానల్ వాడికి దాసులవటం మన ఖర్మ ( ఎదో సంస్కౄతి చానల్ పెడుతున్నారట..బలే పబ్లిసిటి!). 
అసలు ఈ ప్రజలే  ఎందుకు అంతగా ఎగబడుతారు?..పోలీసులు తంతామన్నా సరే.ఎందుకంత రిస్క్‌ తీసుకుంటారు ,
మత ఛాందస శక్తులు మత భావాలను రెచ్చగొట్టే విధంగా ?
చాలాసార్లు హింసాత్మక ప్రదర్శనలు బాబ్రీమసీదు కూల్చివేత, ఆఫ్గనిస్తాన్‌, ఇరాక్‌లపై అమెరికా దాడులు, అమెరికా అధ్యక్షుడు జార్జి బుష్‌ హైదరాబాద్‌ రాక వంటి సందర్భాల్లో ఈ మక్కా మసీదు ప్రాంతం నుంచి ర్యాలీలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించేవారు. అప్పుడు పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు జరిగేవి.ఈరోజు జరిగినయి ఎందువలన ?”పరిస్థితిని అదుపులోకి తేవడానికి పోలీసులు కాల్పులు జరపడం సరైనచర్య కాదట – మరి సరిఅయిన చర్యలు ఎమిటో ?

వ్యాఖ్యానించండి

  • ఇవి కూడా చెప్పాలని వున్నది

  • From Earth

  •  

    మే 2007
    సో మం బు గు శు
    « ఏప్రి   జూన్ »
     12345
    6789101112
    13141516171819
    20212223242526
    2728293031  
  • ఖజానాలు

  • మెటా