ఓ ..పాలబుగ్గల జీతగాడా !

పాలబుగ్గల జీతగాడా
పసులుగాసె మోనగాడా
పాలుమరచి ఎన్నాళ్ళయిందో
ఓ ..పాలబుగ్గల జీతగాడా
కోలువు కుదిరి ఎన్నాళ్ళయిందో !

చాలిచాలని చింపులంగి
చల్లగాలికి సకమకాలి
గోనె సంచి కొప్పునీపెట్టావా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
దానిచిల్లులెన్నో లెక్కబెట్టావా  !
 
తోలు జగ్గల కాలిజోడు
తప్పటడుగుల నడకతీరు
బాటలో పనిలేకుండయిందా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
చేతి కర్రె తోడై నిలిచిందా   !

మాయ దారి ఆవు దూడలు
మాటి మాటికి ఎనుకు దునికి
పంట చేను పాడు చేశాయా
ఓ ..పాలబుగ్గల జీతగాడా
పాలికాపు నిన్నే కోట్టాడా !

(ఇది చిన్నప్పుడు రేడియోలో వినేవాడిని ఇక ఎన్ని చరణాలు వున్నాయో గుర్తులేదు , రాసినది ఏవరో  కూడా తెలియదు కాని శ్రవ్యంగా పాడితే చాలా ప్రభావితముగా వుంటుంది …ఎప్పుడోవిన్న పాట తప్పులు వుంటె ఎత్తి చూపండి సరి చేసుకోంటాను)   
   

అభిప్రాయములు »

  1. చైతన్య చెప్పబడిన

    ఈ పాట రాసింది సుద్దాల హనుమంతు. ‘మాభూమి’ సినిమాలో పాటని పాడింది సంధ్య. పాటని ఇక్కడ వినొచ్చు. http://telugusongs.allindiansite.com/maa_bhoomi.html
    Youtube లో చూడవచ్చు.

  2. చైతన్య చెప్పబడిన

    ఈ పాట రాసింది సుద్దాల హనుమంతు. ‘మాభూమి’ సినిమాలో పాటని పాడింది సంధ్య. పాటని ఇక్కడ వినొచ్చు. http://telugusongs.allindiansite.com/maa_bhoomi.html
    Youtube లో చూడవచ్చు. http://www.youtube.com/watch?v=RRhv1DElVuI

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి

  • ఇవి కూడా చెప్పాలని వున్నది

  • From Earth

  •  

    ఏప్రియల్ 2007
    సో మం బు గు శు
    « మార్చి   మే »
    1234567
    891011121314
    15161718192021
    22232425262728
    2930  
  • ఖజానాలు

  • మెటా