ఉగాది ఎప్పుడొ ? -లాంగ్ వీకెండ్ కోసం పండగనే మార్చారా !! మార్చి 16, 2007
Posted by kasyap in Uncategorized.trackback
నాకు అర్ధం కాని విషయం ఏమిటంటేఉగాది 20 మార్చిని కాదు, 19నే అని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి శలవు ప్రకటించింది.ది ఏమైనప్పటికి పాఢ్యమి ఘడియలు ఉదయం ఉన్న వేళల్లో ఉగాది పండుగను చేసుకోవాలి వ్యయనామ సంవత్సర పంచాంగాలలో 20 వ తేదీ ఉగాదిఅని వుంది.
19 న అమావాస్య ఉదయం 8-52 వరకు (ఒక పంచాంగం ప్రకారం) వుంది. అదేరోజు సూర్యగ్రహణం ఉదయం 7-32 వరకు. సంకల్పం అమావాస్య తిథిగానే చెప్పుకోవాలి.
20న పాడ్యమి తిథి ఉదయం 6-43 వరకు వుంది (ఒక పంచాంగం ప్రకారం). సూర్యోదయానికి పాడ్యమి వుంది కనుక సంకల్పంలో సర్వజిత్ నామ వత్సరే, ఉత్తరాయణే, వసంత ఋతౌ, చైత్రమాసే, శుక్లపక్షే ప్రతిపతిథౌ, భౌమవాసరే అని చెప్పుకోవాలికొత్త గా విడుదలైన సర్వజిత్ నామ సంవత్సర పంచాంగాలు కూడా 20 వ తేదినుంచే ఉగాదితో మొదలయ్యాయి.
మరి ఇంత హథాత్తుగా ప్రభుత్వానికి ఉగాది తేదీపై అనుమానం ఎందుకు వచ్చింది? ప్రముఖ దేవస్థానాలన్నీ కూడా 20 వతేదీనే ఉగాది పండుగ చేస్తూవుంటే మధ్యలొ ప్రభుత్వానికీ జోక్యం ఎందుకు?
దీనికి ఒకటే కారణం నాకైతే అనిపిస్తోంది. అదే వరుసగా శలవలు వస్తాయనేమోనని!!-









వ్యాఖ్యలు»
No comments yet — be the first.