మీ కంప్యూటరు ద్వారా తెలుగు వినటము (”text to speech” for Telugu) ఎలా?

మీ కంప్యూటరు ద్వారా తెలుగు వినటము (”text to speech” for Telugu) ఎలా  

మన  పుస్తక ప్రదర్శనలో కొంత మంది అడిగారు  కంప్యూటరు లో తెలుగు చుడటము వ్రాయటము బాగానే వున్నది మరి వినటం ద్వారా కుదురుతుందా అని  !

ఈ అంశం మీద రెండు సంవత్సరాల క్రితం  ఒక టపారాశాను దానినే దుమ్ముదులిపి కొంచెం మార్చి మీముందుకు

ఇప్పటి వరకు కోన్ని ఉపకణాలు   సీడాక్ వారు  చేసివున్నారు కానీ అవి అంతగా ప్రచారానికి నోచుకోలేదు.       మన తెలుగు వారందరము ఆంగ్ల వ్యామోహంవలన, సాంకేతిక పరిమితుల వలన  వాణిజ్య పరమైన వెసులుబాటు  లేక పోవుట వలన దీని వలన అయితేనేమి మరి దాని వలన అయితే నేమి మరిదేనివలన ఆయితేనేమి ఈ దిశగా ప్రయత్నాలు జరగలేదు .

అయితే   కొద్దిపాటి ఉచిత ఉపకరణాలతో తెలుగును వినవచ్హు కానీ కోన్ని ఉచ్హారణా పరమైన లోపాలు కలవు.

ఉద్దేశ్యము :  తెలుగు  RTS Text ను చదివించటము  Unicode to RTS Object : Generating Telugu sounds from Telugu phonetic script కావలసిన ఉపకరణములు

 1) http://www.readplease.com/english/downloads/#rp2003  మరియు అదే పుట నందు ఇంకా కింది బాగమున ఇటలియన్ వాయస్ కూడా  దిగుమతి చేసుకోనవలయును 3) TTS engine with 2 L&H Italian voices(Male & Female)   కూడా  దిగుమతి చేసుకోనవలయును    

ఇప్పుడు మీరు వినాలనుకోన్న తెలుగు యునీకోడు ని  http://lekhini.org/nikhile.html  లేదా బహర / పద్మ ద్వారా లోకి మార్చుకోవాలి
దీనిని Cut  చెసి Readplease lo paste చేయటమే

Imp note : In read please you have to select Italian voice !  ఇది ఎలా పలుకు తున్నదో  వినవలె నంటే  www.geocities.com/krupal_kasyap/okaraju.mp3

www.geocities.com/krupal_kasyap/telugu.doc ( with pics)

అభిప్రాయములు »

  1. చదువరి చెప్పబడిన

    కశ్యప్! చాలా మంచి ప్రయోగం చేసారు. బాగుంది.
    ఇటాలియనుకూ, తెలుక్కూ వ్యాకరణంలో తేడా ఉండడం చేత గాబోలు, వాక్యంలోని వివిధ భాగాల్లో గొంతు మాడ్యులేషను కుదరలేదు.
    ఏదేమైనా, తెలుగు చదివే పద్ధతికి నాంది పలికారు. అభినందనలు!

  2. వెంకట రమణ చెప్పబడిన

    ఇప్పుడు నాకర్ధమయింది తెలుగును ఇటాలియన్-ఆఫ్-ద-ఈస్ట్(లేదా ఇటాలియన్నే తెలుగు ఆఫ్ ద వెస్ట్) అని ఎందుకంటారో…

  3. వీవెన్ చెప్పబడిన

    :) అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగానేఉంది. కానీ భలే కనుక్కున్నారు.

    తెలుగుని RTSకి మార్చడానికి నిఖిలే (lekhini.org/nikhile.html) కూడా వాడవచ్చు.

  4. వైజాసత్య చెప్పబడిన

    నాకూ ఈ మధ్య ఇదే ఆలోచనొచ్చిందండి. భలే పనికి శ్రీకారం చుట్టారు..శెభాష్

  5. హన్నన్నా…ఎంత ఆశ్చర్యము…పెద్దల మాట చద్ది మూట అని ఊరకే అనలేదు మనవాళ్లు…’ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్’ అన్న వారి మాటలను మీరు ప్రయోగాత్మకంగా నిరూపించారు…భేషో భేష్!

ఈ టపాపై వ్యాఖ్యలకు RSS ఫీడు · TrackBack URI

వ్యాఖ్యానించండి

  • ఇవి కూడా చెప్పాలని వున్నది

  • From Earth

  •  

    జనవరి 2007
    సో మం బు గు శు
    « సెప్టెం   మార్చి »
     123456
    78910111213
    14151617181920
    21222324252627
    28293031  
  • ఖజానాలు

  • మెటా