తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం – ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం

ఈ నెల రెండవ ఆదివారం అనగా (డిసెంబర్ 9న) తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం, హైదరాబాదులో.  డిసెంబర్ రెండవ ఆదివారం 14 2014 —హైదరాబాదులో తెలుగు బ్లాగుల దినోత్సవం .  తెలుగు బ్లాగుల దినోత్సవం సందర్భంగా తెలుగు బ్లాగర్ల సమావేశం మరియు తేనీటి విందుని తెలుగు వికీ పీడియా వారి సహకారం తో  e-తెలుగు ఏర్పాటు చేసింది. తెలుగు బ్లాగర్లందరూ దీనిలో పాల్గొని విజయవంతం చేయమని ప్రార్థన. వివరాలు … తెలుగు బ్లాగుల దినోత్సవ శుభాకాంక్షలు!

వివరాలు

ప్రదేశం : థియేటర్ ఔట్రీచ్ యూనిట్ (టి.ఓ.యు), గోల్డెన్ త్రెషోల్డ్ అబిడ్స్, హైదరాబాద్

తేదీ ,సమయం:  : ఆదివారం, డిసెంబర్ 14, 2014 సాయంత్రం  3 గంటల. నుండి 6 వరకూ

సంప్రదింపులు :   9948152952, 9396533666.

eTelugu Blog Day

eTelugu Blog Day

Kashmir is shown cut off from India – as Per EEnadu.net Image

కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదా!  ‘పాకిస్థాన్‌ అక్రమం గా ఆక్రమించుకున్న భూభాగంతో సహా మొత్తం జమ్మూ-కాశ్మీర్‌ ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమే అని మన పార్లమెంటే స్వయంగా ప్రకటించింది . 

Image

 
ఈ రోజు ఈనాడు పేపర్లో కాశ్మీర్ ను భారతదేశం నుండి ప్రత్యేకం గా చూపటం నన్ను విస్మయ పరచినది . 
దయచేసి ఇలాంటి ఇమేజులు ప్రచురించే ముందు జాగ్రత వహించగలరు  
For your information  It is illegal in India to exclude all or part of Kashmir in a map. it did not show all of Kashmir as part of India as per Indian claim

Malaysia Airlines missing plane MH370 ( Google Maps & mapbox)

To day  I read news about the Malaysia Airlines  missing plane MH370   . As per write up on CNN (http://ireport.cnn.com/docs/DOC-1105961?npt=NP1) Hyderabad Techie Anoop Madhav Yeggina   found a satellite image of a large aircraft flying very low above the Andaman Islands. The Image as the Mapbox

2014-03-19 08:21:32 నుండి తెరపట్టు

surprisingly there is no such image in Google maps,  http://goo.gl/maps/h4sqLImage

 

 

 

ప్రపంచ మాతృ భాషా దినం- International Mother Language Day

ఈరోజు ఫిబ్రవరి 21-ప్రపంచ మాతృ భాషా దినం- International Mother Language Day
భావ వ్యక్తీకరణలో భాష అత్యంత ముఖ్యం. ప్రపంచీకరణ నేపథ్యంలో ఇప్పుడు కొన్ని భాషల ఆధిపత్యమే నడుస్తున్నా… ఎవరికివారికి మాతృభాషపై ఉన్న మమకారం ప్రత్యేకమైందే. 
తెలుగు భాష మాట్లాడే వారు ప్రపంచ వ్యాప్తంగా షుమారు 18 కోట్ల మంది వున్నారంటే అతిశయోక్తి లేదు.మన తెలుగు వాళ్ళకు మాత్రమే తెలుగును ఒక తల్లిగా భావించి పూజించు కొనే సాంప్రదాయం ఉన్నది. మన రాస్ట్రము ముక్కలు ఆయునా తెలుగు ఒక భాషగా మాత్రం అంతరించే ప్రసక్తే లేదు. టీ.వీ ఛానెళ్ళు, సినిమా పరిశ్రమ, పత్రికలు ఈ భాష మీదే బ్రతుకుతున్నాయి. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ది కి మన వంతు కృషి చేద్దాం 
వీలైనంత వరకు తెలుగు లో మాట్లాడడానికి, వ్రాయడానికి ప్రయత్నిద్దాం.
మన భాషను సజీవంగా నిలుపుకుందాం. హిందీ తప్ప మిగిలిన భాషలు ఆయా రాస్ట్రాలకు మాత్రమే పరిమితం అయ్యాయి, మనం ఒక అడుగు ముందుకు వేశాం ! 

 ఈసారి మాతృభాషా దినోత్సవం నాటికి ఆంధ్రప్రదేశ్‌ విభజన మరో గుణపాఠం నేర్పుతోంది. ఓ జాతి కట్టుబాటుకు భాషా ప్రాతిపదిక ఒక్కటే సరిపోదని, అంతకుమించి అన్ని ప్రాంతాల సమగ్రాభివృద్ధి కాంక్షలకు గొడుగుపట్టే సుపరిపాలన మరెంతో అవసరమనీ పాలకులు తెలుసుకోవాలి.పాలకుల రాజకీయ పాచికలు పెంచిన మనస్పర్ధల్ని పక్కన పెట్టి, ఇరువైపులా తెలుగువారి ఔన్నత్యం మరింతగా పరిమళించాల్సిన తరుణమిది.

తెలుగు వికీపీడియా దశాబ్ధి ఉత్సవాలు – కార్యక్రమ వివరాలు

తెలుగు వికీపీడియా దశాబ్ధి ఉత్సవాలు – కార్యక్రమ వివరాలుImage  

అందరం ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆశిస్తున్నాము #Telugu   #Wikipedia  #TeWiki10 

తెలుగు వికీపీడియా దశాబ్ది ఉత్సవాలు -అందరికీ ఆహ్వానం!

తెవికీ దశాబ్ది ఉత్సవాలు- Telugu Wikipedia 10th AnImage దయచేసి మీకు తెలిసిన తెలుగు  మిత్రులకు , తెలుగు భాషా ప్రేమికులకు లను తెవికీ దశాబ్ది ఉత్సవాల గురించి తెలియ చేయడి  . 

 

అందరం  ఉత్సాహంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని ఆశిస్తున్నాము 
 
ఈ వేడుకలలో భాగంగా, తెలుగు వికీపీడియాను ఉపయోగించుకోవడం, కొత్త సమాచారాన్ని చేర్చడం, ఉన్న సమాచారాన్ని సరిదిద్దడం వంటి అంశాలపై ప్రత్యక్ష ప్రదర్శనతో కూడిన రెండు రోజుల సదస్సును నిర్వహిస్తున్నాం. తెలుగు వికీపీడియాలోని విశేష వ్యాసాలతో కూడిన సీడీని కూడా ఈ సందర్భంగా పంపిణీ చేస్తున్నాం. తెలుగులో అపూర్వ విజ్ఞాన సంపదను సేకరించే ఈ మహా ప్రయత్నంలో వీలైనంత ఎక్కువ మందిని భాగస్వాముల్ని చేసే ప్రయత్నం చేస్తున్నాం. తెలుగు వికీపీడియా మరియు సోదర వికీ ప్రాజెక్టుల అభివృద్ధికి కృషి చేసిన సభ్యులకు, ఆదరించి, ప్రోత్సహించిన సమాజంలోని వ్యక్తులు, సంస్థలందరికి వికీపీడియా దశాబ్ది సందర్భంగా ధన్యవాదాలు. తెవికీ విజ్ఞానగనిలా విలసిల్లి ప్రతి ఒక్కరికి విజ్ఞానాన్ని పంచుతూ, ప్రతి ఒక్కరి విజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ అభివృద్ధి చెందాలని కోరిక. 
 
పది సంవత్సరాల ఈ ప్రయాణంలో ఎందరో ఔత్సాహికుల తోడ్పాటుతో యాభై వేల పైబడి వ్యాసాలతో భారతదేశం లోని అన్ని భాషలలో అధిక వ్యాసాలు కలిగిన భాషలలో ఒకటిగా నిలిచింది. ఇందుకు కారణం వికీపీడియాలో వ్యాసాలు రాస్తూ అభివృద్ధి పరుస్తున్న ఎందరో మహానుభావులు. ఆ మహానుభావులను ఒక చోట చేర్చి, సత్కరించాలనీ, సమూహ సభ్యులు ఒకరినొకరు ప్రత్యక్షంగా కలవడం ద్వారా సమిష్టి కృషిలో పాల్గొనేందుకు మరింత స్ఫూర్తి దొరుకుతుందనే ఆశయంతో ఈ దశాబ్ది మహోత్సవాలను సంబరాలుగా జరుపుకోబోతున్నాం.

అందరికీ ఆహ్వానం!